AP&TGBUSINESSNATIONALOTHERS

ఏపీ 2.4 ట్రిలియన్ ఎకానమీగా తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్దం-సీ.ఎం చంద్రబాబు

అమరావతి: పారిశ్రామిక పురోగతిలో సీఐఐది కీలక పాత్ర అని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం పారిశ్రామికంగా వృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.సోమవారం ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. వినూత్న ఆలోచనలతో లక్ష్యాలు చేరుకోవచ్చని,1990 నాటి ఆర్థిక సంస్కరణల ఫలితాలను ప్రస్తుతం చూస్తున్నామని అన్నారు.ప్రధాని మోదీ సుస్థిరమైన పాలన అందిస్తున్నారని,దేశ శ్రేయసు దృష్ట్య ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలని ప్రధాని మోదీ సూచించారని అన్నారు.భవిష్యత్ అవసరాల కోసం విద్యా సంస్థలు, ప్రభుత్వం, పారిశ్రామిక రంగం కలిసి కృషి చేయాల్సి ఉందన్న చంద్రబాబు, పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మానవ వనరులు అవసరం అవుతయన్నారు. విద్యారంగంలోని సంస్థలు నిపుణులైన మానవ వనరులను సిద్ధం చేయాల్సి ఉందని తెలిపారు.

అంతా కలిసి పనిచేయాల్సిన అవసరం:- గ్లోబల్ టెక్ రంగంలో లీడర్ గా మారాలంటే అంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధన, స్కిల్లింగ్, స్టార్టప్, మాన్యుఫాక్చరింగ్, గవర్నెన్స్, ఇన్నోవేషన్ లాంటి సమీకృత విధానాలపైనే దేశ అభివృద్ధి అధారపడి ఉంటుందని,ఆంధ్రప్రదేశ్ ను 2047 నాటికి ఏపీ 2.4 ట్రిలియన్ ఎకానమీగా తయారు కావాలని ప్రణాళికలు చేసుకున్నాం అని వెల్లడించారు. భారత్ 2047 నాటికి ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుతుందని ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *