మహాకుంభమేళాలో ఏర్పాట్లల్లో 5 కీలక మార్పులు-వీవీఐపీ పాస్‌లు పూర్తిగా రద్దు-యోగీ
2025 మహా కుంభమేళా యొక్క ముఖ్యమైన తేదీలు:-
జనవరి 13, 2025 : పౌష్ పూర్ణిమ, పండుగ ప్రారంభ రోజు
జనవరి 14, 2025 : మకర సంక్రాంతి, మొదటి షాహి స్నాన్ (రాయల్ బాత్)
జనవరి 29, 2025 : మౌని అమావాస్య, రెండవ షాహి స్నాన్
ఫిబ్రవరి 3, 2025 : బసంత్ పంచమి, మూడవ షాహీ స్నాన్
ఫిబ్రవరి 26, 2025 : మహా శివరాత్రి, పండుగ ముగింపు
అమరావతి: మహా కుంభమేళా ఏర్పాట్లను నిశితంగా పరిశీలించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని,, పోలీసు డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించారు..మహాకుంభ్ లో జరిగిన తొక్కిసలాట సంఘటన నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.. వసంత పంచమికి ఏర్పాట్లు,,భద్రత,, ప్రజా సౌకర్యానికి సంబంధించిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని అదేశించారు.. మహాకుంభమేళాలో ఎలాంటి అపశృతులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో బాగంగా యోగీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయం తీసుకుంది.. కుంభమేళా నిర్వహణలో 5 కీలక మార్పులు చేపట్టింది.. వీవీఐపీ పాస్‌లను పూర్తిగా రద్దు చేసింది..
5 కీలక మార్పులు:-
1-భక్తుల రద్దీని నియంత్రించేందుకు మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలోకి ఎలాంటి వాహనాలు ప్రవేశించకుండా ఈ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్‌గా పేర్కొంది..
2-వాహనాల ఎంట్రీకి ఎలాంటి మినహాయింపులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది..వీవీఐపీ, స్పెషల్ పాస్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది..
3-ప్రయాగ్‌రాజ్ పొరుగునున్న జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్దే నిలిపివేయాలని,,వాహనాల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది..
4-ఫిబ్రవరి 4వ తేదీ వరకు ప్రయాగ్‌రాజ్ నగరంలోకి ఫోర్ వీలర్ వాహనాలు ప్రవేశించకుండా నిషేధం విధించామని ప్రభుత్వం వెల్లడించింది..
5-భక్తుల సౌకర్యార్థం కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో వన్-వే రూట్ ట్రాఫిక్ వ్యవస్థను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది..
చిరు వ్యాపారులు రోడ్లపై దుకాణాలు పెట్టుకుంటే వాటిని వెంటనే ఖాళీ స్థలాల్లోకి మార్చాలని స్థానిక యంత్రాంగానికి యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది..మేళా ప్రాంతంలో పెట్రోలింగ్‌ను పెంచాలని,,భక్తులు ఎక్కడా ఆగకుండా వారికి అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించింది..