రాష్ట్రానికి కొత్త DGPగా హరీష్ కుమార్ గుప్తాని నియమిస్తు ప్రభుత్వ ఉత్తర్వులు
అమరావతి: రాష్ట్రానికి కొత్త DGPగా హరీష్ కుమార్ గుప్తాని నియమిస్తు సీ.ఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు..ఇప్పటి వరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఆయన విధులు నిర్వహించారు.. ప్రస్తుతం DGPగా ఉన్న సీహెచ్ ద్వారకా తిరుమల రావు జనవరి 31వ తేదీన రిటైర్ కాబోతున్నారు..ద్వారకా తిరుమలరావు రిటైర్ కాబోతున్న సమయంలో రాష్ట్రానికి కొత్త డీజీపీగా మాదిరెడ్డి ప్రతాప్‌తో పాటు హరీష్ కుమార్ గుప్తా పేరును పరిశీలించినట్లు సమాచారం..ఈ రెండు పేర్లలో హరీష్ కుమార్ పేరును ప్రభుత్వం ఖరారు చేసింది.