జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీఐ
అమరావతి: జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల కమిషన్ శుక్రవారం ప్రకటించింది..90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి మూడు విడతలుగా సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీల్లో ఎన్నికలు నిర్వహించి,, అక్టోబర్ 4వ తేదిన కౌంటింగ్ జరిపి ఫలితాలు వెల్లడిస్తారు.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఒకే విడతలో పోలింగ్ అక్టోబర్ 1వ తేదిన నిర్వహించనున్నారు.. అక్టోబర్ 4న ఫలితాలు ప్రకటిస్తారు.
జమ్మూకశ్మీర్ 90 అసెంబ్లీ స్థానాలకు గాను తొలివిడతలో 24 అసెంబ్లీ స్థానాలకు, రెండో విడతలో 26 అసెంబ్లీ స్థానాలకు, మూడో విడతలో 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 4న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.
హర్యానా మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో అక్టోబర్ 1వ తేదిన పోలింగ్ జరుగుతుంది..అక్టోబర్ 4వ తేదిన కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.