దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
అమరావతి: రామేశ్వరంలో దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అదివారం మధ్యహ్నం 12.45 ప్రారంభించి జాతికి అంకితం చేశారు..అలాగే రామేశ్వరం-తాంబరం ప్రత్యేక రైలును కూడా ప్రధాని ప్రారంభించగా, రైలులో విద్యార్థులు, ఇతర ప్రయాణికులు సందడి చేశారు..అదే విధంగా వంతెన కిందుగా ప్రయాణించిన కోస్ట్ గార్డ్ నౌకకూ మోదీ పచ్చ జెండా ఊపారు..ఈ బ్రిడ్జి కట్టి 100 సంవత్సరాలు దాటిపోవడంతో, పంబన్‌లో కొత్త రైల్వే బ్రిడ్జిని నిర్మించారు.. నౌకలు వచ్చినప్పుడు వాటికి దారి ఇచ్చేలా ఇది ఓపెన్ అవుతుంది..న్యూ పంబన్ బ్రిడ్జి భారతదేశ ఇంజనీరింగ్ నైపుణ్యానికి, విజనరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కు నిదర్శనంగా నిలుస్తోంది..
2020లో పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ,,నేడు శ్రీరామ నవమి సందర్బంగా ప్రారంభించారు..వర్టికల్ లిఫ్ట్ బరువు 660 టన్నులు కాగా పొడువు 72.5 మీటర్లు..పంబన్ బ్రిడ్జి మొత్తం పొడవు 2.07 కిలోమీటర్లు.. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో బ్రిడ్జి నిర్మాణం చేయడంతో పాటు తుప్పు పట్టకుండా స్పెషల్ కెమికల్‌తో కోటింగ్ వేశారు.. పంబన్ వంతెన నిర్మాణం ఖర్చు రూ.535 కోట్లు..బ్రిడ్జి కింద నుంచి ఓడలు ఎటువంటి ఆటంకాలు లేకుండా రాకపోకలు సాగించ వచ్చు..బ్రిడ్జికి ఇరు వైపులా ఉండే భారీ స్తంభాలకు 320 టన్నుల బరువు ఉన్న దూలాలు (బరువు 625 టన్నులు) వేలాడుతూ బ్రిడ్జికి సపోర్ట్ గా ఉంటాయి.