పుష్పా హీరో అల్లు అర్జున్ పై పోలీసు స్టేషన్ లో కేసు నమోదు
హైదరాబాద్: సినీమా నటుడు,, పుష్పా హీరో అల్లు అర్జున్‌పైన,,అయన సెక్యూరిటీపైనా,, సంధ్య థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు..
ప్రమాదం జరిగిన నేపధ్యం:- పుష్ప-2 ప్రీమియర్ షో కోసం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్దకు చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో వచ్చాడు..అయన్నను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది..ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీవఛార్జి చేశారు.. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి(35) అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీ తేజ(9) కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయి,,తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు..
అల్లు అర్జున్ టీమ్‌పై సెక్షన్:- ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వస్తున్న సందర్భంలో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు సంధ్య థియేటర్ యాజమాన్యంపై,,సదరు సమాచారాన్ని పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీమ్‌పై సెక్షన్ 105, 118 BNS యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారని,,సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ వెల్లడించారు..ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని,, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని డీసీపీ తెలిపారు.