మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా 3వ సారి ప్రమాణం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్
అమరావతి: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం సాయంత్రం 3వ సారి ప్రమాణం చేశారు..ఉప ముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్‌షిండే,,అజిత్‌పవార్ ప్రమాణం చేశారు.ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ,,అమిత్‌షాతో పాటు పలువురు ప్రముఖులు,,ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు,,ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు,, పలువురు కేంద్రమంత్రులు ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు..అలాగే ప్రముఖ వ్యాపారవేత్తలు,, బాలీవుడ్ స్టార్స్ తో పాటు మాజీ క్రికెటర్ సచిన్ సతీసమేతంగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు..మహాయుతి కూటమి ఐక్యతను సూచిస్తూ ఫడ్నవీస్,,షిండే,, అజిత్‌పవార్ ఒకేసారి వేదిక మీదకు చేరుకున్నారు..దాదాపు 50 వేల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.