AP&TGNATIONALOTHERSTECHNOLOGY

ప్రోబా-3 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలకి ప్రవేశపెట్టిన PSLV – C59 రాకెట్‌

నెల్లూరు: శ్రీహ‌రికోట‌ (SDSC-SHAR)లోని స‌తీష్ ధావ‌న్ అంత‌రిక్ష కేంద్రం నుంచి గురువారం సాయంత్రం 4:12 గంటలకు PSLV – C59 రాకెట్‌ నింగిలోకి ప్రోబా-3 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది.. కృత్రిమ సూర్య గ్రహణాన్ని సృష్టించడం ద్వారా భానుడి గుట్టు విప్పేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ (ESA)కు చెందిన PROBA-3 మిషన్‌ శాటిలైట్లు పనిచేస్తాయి.. ప్రోబా-3 మిషన్‌లో రెండు ఉపగ్రహాలు (కరోనాగ్రాఫ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌, ఆక్యుల్టర్‌ స్పేస్‌క్రాఫ్ట్‌) ఉన్నాయి.. దాదాపు 550 కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహాలను అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు.. కృత్రిమ గ్రహణాన్ని సృష్టించడం ద్వారా సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాను అధ్యయనం చేయడమే ప్రోబా-3 లక్ష్యం. ఆ రెండు ఉపగ్రహాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ క్రమపద్ధతిలో భూకక్ష్యలో పరిభ్రమిస్తాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *