ఉగ్రవాదసంస్థ హమాస్‌తో సంబంధాలు? అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్ట్
అమరావతి: పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ఓ భారతీయ విద్యార్థిని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..వాషింగ్టన్ డీసీలోని జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయంలో పరిశోధకుడైన భారతీయ విద్యార్థి బదర్ ఖాన్, స్టూడెంట్ వీసాపై అమెరికాలో ఉంటున్నాడు..యూనివర్సిటీలో అతడు హమాస్ ఉగ్రసంస్థకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తెలియచేసినట్లు ఫాక్స్ న్యూస్ పేర్కొంది..సోమవారం రాత్రి వర్జీనియాలోని అతని ఇంటి వెలుపల ఫెడరల్ ఏజెంట్లు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది..అతడి వీసాను కూడా రద్దు చేసినట్లు పేర్కొంది..