యూకేలో లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును అందుకున్న చిరంజీవికి
అమరావతి: మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకత సంతరించుకున్నారు..నాలుగున్నర దశాబ్దాలకు పైగానే తెలుగు సినీపరిశ్రమను శాసిస్తున్న చిరంజీవి ఎన్నో అవార్డులని కూడా అందుకున్నారు.. తాజాగా యుకే పార్లమెంట్ నుంచి అరుదైన సత్కారం అందుకున్నారు. చిరంజీవిని బ్రిటన్ పార్లమెంట్‌లోని గ్రూప్ ఆఫ్ ఎంపీలు కలిసి లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్‌తో సత్కరించారు..యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో వేడుక జరిగింది..పార్లమెంట్ సభ్యులు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ తదితరులు పాల్గొని చిరంజీవికి అవార్డ్ అందించారు..సినిమాలతో పాటు ప్రజాసేవ, దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి ‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేసింది.. బ్రిడ్జ్ ఇండియా అనే సంస్థ యూకేలో పబ్లిక్ పాలసీ రూపకల్పనలో కృషి చేస్తుంది.. వివిధ రంగాల్లోని వ్యక్తులు వారు సాధించిన విజయాలు,,తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో సంస్థ ప్రతినిధులు ఇలా సత్కరిస్తూ ఉంటారు..తొలి సారిగా బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును చిరంజీవికి అందజేసింది..