హీరో నాగచైతన్య, సమంతలు విడిపోవడానికి డ్రగ్స్ ఆలవాటు వున్నకేటీఆరే కారణం-మంత్రి సురేఖ
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు..హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతలు విడిపోవడానికి కేటీఆరే కారణమని ఆరోపించారు.. కేటీఆర్‌కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటని,, వారికి డ్రగ్స్ అలవాటు చేసింది ఆయనేనన్నారు..బాపూఘాట్ లో గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడుతూ “కేటీఆర్ కు తల్లి, అక్క, చెల్లి లేరా….హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని మండిపడ్డారు.. హీరోయిన్లకు మత్తుపదార్థాలు అలవాటు చేశారు…వాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారు..కేటీఆర్ బాధ తట్టుకొలేక చాలా మంది హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి ఆయనే కారణం అన్నారు.. ఆయన డ్రగ్స్ కు అలవాటుపడి,, హీరోయిన్లతో రేవ్ పార్టీలు చేసుకుని వాళ్లని బ్లాక్ మెయిల్ చేశారు..ఈ విషయం సినీమా పరిశ్రమలో ఉన్న అందరికీ తెలుసు అన్నారు..మంత్రి సీతక్క, మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అసభ్యకర పోస్టులు పెట్టారు.. మూడు సోషల్ మీడియా అకౌంట్ ల ద్వారా దుబాయ్ నుంచి పోస్టులు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు, నువ్వెందుకు రియాక్ట్ కాలేదు అంటూ హరీష్ ప్రశ్నించారు.. అసభ్యకరంగా పోస్టులు పెట్టినవారిపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.