ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్,22 మంది మావోయిస్టులు మృతి
ఒక జవాను వీరమరణం..
హైదరాబాద్: మావోయిస్టులకు మరోసారి కొలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్-దంతేవాడ జిల్లా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు..బీజాపూర్-దంతేవాడ జిల్లా సరిహద్దులోని గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులను ఏరివేసేందుకు కూబింగ్ ఆపరేషన్ ను జాయింట్ టీమ్ ప్రారంభించింది..కూబింగ్ సమయంలో భద్రతబలగాలకు మావోయిస్టులు ఎదురుపడడంతో, గురువారం ఉదయం 7 గంటల నుంచి మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి..ఈ కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మరణించగా,, ఘటనస్థలంలో భారీ మొత్తంలో ఆటోమేటిక్ ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు పద్దెనిమిది మంది నక్సలైట్ల మృతదేహాలను కూబింగ్ టీమ్స్ ,స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం..ఈ ఎదురు కాల్పుల్లో బీజాపూర్ డీఆర్జీకి చెందిన ఒక సైనికుడు వీరమరణం పొందాడు.. సంఘటనా స్థలంలో ఎన్‌కౌంటర్, సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తొంది..మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం చుట్టూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది..వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతగులుతోంది..”నక్సల్ ముక్త్ భారత్ అభియాన్”లో ఆపరేషన్ పేరుతో మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రం,మావోయిస్టుల పట్ల కఠినంగా వ్యవహరిస్తొంది.. దేశంలో మావోయిస్టు పార్టీలను 2026 మార్చి 31 నాటికి పూర్తిగా నిర్మూలిస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు..ఇప్పటి వరకు 300లకు పైగా మావోయిస్టులు హతమైనట్లు కేంద్ర హోంశాఖ అధికారులు చెబుతున్నారు..ముఖ్యంగా మావోయిస్టు కంచుకోటగా ఉన్న బస్తర్ ప్రాంతమే టార్గెట్‌గా ఆపరేషన్ కొనసాగుతోంది.. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులను ఏరివేస్తుండడంతో తెలంగాణలో మావోయిస్టులు ప్రవేశించకుండా గ్రౌహౌండ్స్ బలగాలు కూంబింగ్ చేస్తున్నారు.