84 బ్యాచ్‌ల మందులు లోపభూయిష్టంగా ఉన్నాయి మీరు వాడుతున్నారా?
అమరావతి: దేశంలోని ఔషధాల నాణ్యతను పర్యవేక్షించే సంస్థ (సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) ఇటీవల చేసిన తనిఖీల్లో 84 బ్యాచ్‌ల మందులు నాణ్యతలో విఫలమయ్యాయి.. వాటిలో కొలెస్ట్రాల్, డయాబెటిస్, ఎసిడిటీ సహా పలు వ్యాధుల మందులు ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే పలు రకాల మందులు అనేక మంది ప్రాణాలతో ఆడుకుంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు..ప్రతిరోజూ లక్షల సంఖ్యలో ప్రజలు ఈ మందులను ఉపయోగిస్తున్నారు..ఇవి రోగాన్ని నయం చేసే బదులు, మీ ఆరోగ్యాన్ని మరింత పాడు చేస్తాయని పేర్కొంటున్నారు.
CDSCO ప్రతి నెలా మార్కెట్ నుంచి పలు రకాల మందుల నమూనాలను సేకరించి వాటిని పరీక్షిస్తుంది. ఆ క్రమంలో ఔషధాలు సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే, అది “నాణ్యత లేని నాణ్యత” (NSQ)గా ప్రకటిస్తుంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 2024 నివేదిక ప్రకారం 84 బ్యాచ్‌ల మందులు లోపభూయిష్టంగా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో అనేక సాధారణ వ్యాధులకు ఇచ్చిన మందులు కూడా ఉన్నాయి.వాటి వివరాలు క్రింది లిస్ట్ లో వున్నాయి..