తీవ్రవాయుగుండంగా బలపడనున్న అల్పపీడన-వాతావరణశాఖ
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం,,దానిని ఆనుకుని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రం మీదుగా ఆదివారం నాటికి వున్న అల్పపీడన ప్రాంతం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలిందని వాతావరణశాఖ తెలిపింది..అల్పపీడన తీవ్రంగా మారి సోమవారం ఉధయం 8.30 గంటల సమయంలో కేంద్రీకృతమై ఉన్నదని పేర్కొంది.. దక్షిణ బంగాళాఖాతం,,ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంలో త్రికోణమలీకి ఆగ్నేయంగా 600 కి.మీ.నాగపట్టినానికి ఆగ్నేయంగా 880 కి.మీ, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 980 కి.మీ,,చెన్నైకి ఆగ్నేయ దిశలో 1050 కి.మీటర్లో కేంద్రికృతమైందని తెలిపింది..గడిచిన 3 గంటల్లో 30 కీమీ వేగంతో కదులుతొందని,, రాగల 24 గంటల్లో వాయువ్య దిశగా పయనించి తీవ్రవాయుగుండంగా బలపడనున్నట్లు వివరించారు..ఆటు తర్వాత మరో 2 రోజుల్లో తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది..అలాగే దక్షిణకోస్తా తీరం వెంబడి మంగళవారం గంటకు 50-70కిమీ, బుధవారం నుంచి 55 -75కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.