డిసెంబర్ నెలాఖరుకు టిడ్కో గృహాలకు మౌలికవసతులు పూర్తి చేసేలా చర్యలు-మంత్రి నారాయణ
అమరావతి: రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలతో పాటు మౌళిక వసతుల కల్పన డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేసేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నట్లు మున్సిపల్,పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు.. టిడ్కో గృహాలపై అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు.. టిడ్కో ద్వారా మొత్తం 7 లక్షల 1481 ఇళ్లను నిర్మించేందుకు కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నట్లు మంత్రి సభకు వెల్లడించారు..వీటిలో 5 లక్షల ఇళ్లకు నాటి టీడీపీ ప్రభుత్వంలో పాలనాపరమైన అనుమతులు జారీ చేసినట్లు మంత్రి చెప్పారు.మొత్తం 5 లక్షల ఇళ్లకు గాను 3 లక్షల 13 వేల 832 ఇళ్లకు టెండర్లు పిలవగా 77 వేల 371 ఇళ్లు పూర్తిఅయ్యయని,,మరొక 89 వేల 671 ఇళ్లు 75 శాతం పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు..మరొక 49 వేల 329 ఇళ్లు 50 శాతం పూర్తి చేశామన్నారు..మొత్తంగా 3 లక్షల13 వేల 832 ఇళ్లను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయడానికి అన్ని విధాల ప్రయత్నిస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ శాసనసభలో వివరించారు.