AP&TGDEVOTIONALOTHERS

తిరుమల గిరులపై గోవింద నామాలు మాత్రమే ప్రతిధ్వనించాలి-సి.ఎం చంద్రబాబు

తిరుమల: పవిత్రమైన తిరుమల దివ్య క్షేత్రంలో నిరంతరం గోవింద నామస్మరణ మాత్రమే ప్రతిధ్వనించాలని, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.తిరుమల పర్యటన సందర్భంగా శుక్రవారం సాయంత్రం దర్శనానంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలపై స్వామివారి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని ప్రార్థించాలన్నారు.భక్తుల కొరకు టీటీడీ యాజమాన్యం ఎన్నో ఏర్పాట్లను చేస్తున్నదన్నారు. అన్న ప్రసాదం, పారిశుద్ధ్యం, వంటి అనేక సౌకర్యాలను భక్తుల కొరకు కల్పించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో లక్షలాదిమంది భక్తులు పాల్గొంటారు. ఈ సౌకర్యాలను వారందరూ వినియోగించుకోవాలని కోరారు. అనంతరం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన శుక్ర‌వారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు.మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, టిటిడి ఈవో శ్యామల రావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *