వికాస్ లిక్విడ్ ఇంజిన్‌ను విజయవంతంగా రీ స్టార్ట్ చేసిన ఇస్రో
అమరావతి: గగనతలంలో విజయ పరంపర కొనసాగించేందుకు ఇస్రో మరో మైలురాయిని అధికమించింది..భవిష్యత్ లో అతి భారీ ఉపగ్రహాలను ప్రయోగించాలంటే,,శక్తి వంతంమైన ఇంజెన్స్ కావల్సివస్తుంది..ఈ లోటును అధికమించేందుకు ఇస్రో చేపట్టిన వికాస్ లిక్విడ్ ఇంజిన్ ప్రయోగం విజయవంతంమైంది.. బెంగుళూరులోని మహేంద్రగిరి, ప్రొపల్షన్ కాంప్లెక్స్ లోని పరీక్షా కేంద్రంలో వికాస్ లిక్విడ్ ఇంజిన్‌ను విజయవంతంగా పునఃప్రారంభించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శనివారం వెల్లడించింది..ఇస్రో ప్రయోగించే రాకెట్స్ కు లిక్విడ్ స్టేజ్‌ల్లో మరింత శక్తినిచ్చేదే ఈ వికాస్ ఇంజిన్ అని తెలిపింది..జనవరి 17వ తేదిన వికాస్ లిక్విడ్ ఇంజిన్‌ను మళ్లీ మండించినట్లు పేర్కొంది..మొదటిగా ఇంజిన్‌ను 60 సెకన్ల పాటు,,ఆటు తరువాత 120 సెకన్ల పాటు ఆపివేసి,, మళ్లీ 7 సెకన్ల పాటు మండించినట్లు వెల్లడించింది.. పరీక్ష సమక్షంలో అన్ని పారామీటర్స్ సాధారణంగా ఉన్నట్లు తెలిపింది..ఇంజిన్ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు అదనపు పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయని పేర్కొంది..
భవిష్యత్తులో పునర్వినియోగ ప్రయోగ వాహనాలకు కీలకమైన పునాదిని ఇస్రో అభివృద్ది చేసుకుంటొంది..
ఇంజిన్ అభివృద్ధిలో ISRO చైర్‌పర్సన్ V నారాయణన్, LVM3 యొక్క L110 దశను పనితీరును పర్యవేక్షించారు..”ఈ దశ చాలా కీలకమైంది.. ISRO ప్రొపల్షన్ కాంప్లెక్స్, మహేంద్రగిరిలో విలీనం చేసిన 10వ L110 లిక్విడ్ స్టేజ్ & NewSpace India Limited (NSIL) & AST SpaceMobile & Science, LLCకి సంబంధించిన “బ్లూబర్డ్ బ్లాక్ 2” ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి వాణిజ్య ఒప్పందం ప్రకారం LVM3 మిషన్ కోసం కేటాయించబడిందని” ఏజెన్సీ తెలిపింది.