కమీషనర్ క్షేత్ర స్థాయిలో ఆకస్మికంగా పర్యటించారా ?
(కొత్తగా బాధ్యతలు చేపట్టిన నగరపాలక సంస్థ యువ IAS అధికారి సూర్యతేజ్,,గురువారం ఉదయం నుంచి మోటర్ బైక్ పై నగరంలో పర్యటిస్తూ,నగరంలో పారిశుద్యం పరిస్థితులను అర్దం చేసుకునేందుకు ప్రయత్నించడం అభినందనీయం..
రోడ్లపైన పనిచేసే పారిశుద్య కార్మికులు ఎంత మంది ? మస్టర్స్ ఎంటర్ చేసే కార్మికుల సంఖ్య ఎంత మందిని అనేది ? ఒక సారి లోతూగా విచారిస్తే,,నెలకు లక్షల్లో నగరపాలక సంస్థకు నిధులు మిగులుతాయి.. సంవత్సరాల నుంచి తిష్ట వేసుకుని కుర్చోని వున్న హెల్త్ డిపార్టమెంట్ ఉద్యోగులు పదుల సంఖ్యలో వున్నారు..వీరికి నెల జీతాలు రాకపోయిన పెద్దగా పట్టింపు వుండదంటేనే ఆర్దం చేసుకోవచ్చు..ఇలాంటి వారిని లైన్ పెట్టినప్పడే,,నగరపాలక సంస్థ ఆరోగ్యం(పారిశుద్యం) బాగుపడుతుంది..అది కమీషర్ కు వీలు అవుతుందా ?
కమీషనర్ క్షేత్ర స్థాయిలో ఆకస్మికంగా పర్యటించారా అంటే ? కాకుంటే ఏ వార్డులో పారిశుద్యం పనులను పరిశీస్తారో అనే విషయం సంబంధిత మేస్త్రీలకు,సచివాలయం సిబ్బందికి తెలియచేయకుండా వెళ్లినట్లు వున్నారు..గత కమీషనర్ లాగానే,,మొదట్లో రోడ్డపైకి వచ్చి హడవిడి చేసి,,తరువాత ఏ.సి రూమ్స్ లోనే కూర్చుని సమావేశాలంటూ గడిపి వేస్తారా ? లేక ఇలాగే వారంలో రెండు సార్లు అయిన డివిజన్స్ లోని చిన్న చిన్న వీధుల్లో కూడా పర్యటిస్తారా ? అనేది వేచి చూడాలి..ఇక ఆసలు విషయంలోకి వస్తే………….)
పన్ను వసూళ్ల లక్ష్యాలను పూర్తి చేయండి..
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్థి పన్నుల వసూళ్లకై రెవెన్యూశాఖకు నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులకు లక్ష్యాలను నిర్దేశించి పర్యవేక్షించాలని కమిషనర్ సూర్య తేజ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నగర పాలక సంస్థ రెవెన్యూ శాఖ అధికారులతో కార్యాలయంలోని కమిషనర్ గురువారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఆర్ధిక సంవత్సరానికి ఇప్పటివరకు 26 శాతం పన్నుల వసూళ్లు మాత్రమే జరిగాయని గుర్తుచేశారు. రెవెన్యూ అధికారులంతా పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలని, పన్నులు చెల్లించని కమర్షియల్ భవనాలను గుర్తించాలని ఆదేశించారు. నగర వ్యాప్తంగా ప్రతీ భవనాన్ని పన్ను పరిధిలోకి తీసుకురావాలని కమిషనర్ ఆదేశించారు. పన్ను వసూళ్ళలో సచివాలయ అడ్మిన్ కార్యదర్శులకు లక్ష్యాలను నిర్దేశించాలని సూచించారు. రెవెన్యూ అధికారులంతా కార్పొరేషన్ ఆదాయం పెంచేందుకు కృషి చేయాలని కమిషనర్ సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, రెవెన్యూ అధికారులు సమద్, శ్రీనివాసులు, రాజేశ్వరి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.