ఉగ్రవాదం,ప్రచ్ఛన్న యుద్ధంతోనే ఆ దేశం జీవనం చేస్తోంది-ప్రధాని మోదీ
పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ వార్నింగ్..
అమరావతి: పాకిస్థాన్ సరిహద్దు వద్ద కుయుక్తులకు పాల్పడి గతంలో విఫలం అయినప్పటికి,, ఓటమి చరిత్ర నుంచి ఆ దేశం ఏమీ నేర్చుకోలేదని ప్రధాని మోదీ అన్నారు..ఉగ్రవాదం,, ప్రచ్ఛన్న యుద్ధంతోనే ఆ దేశం జీవనం చేస్తోందని విమర్శించారు.. కార్గిల్‌లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోడీ సందర్శించారు..కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి నేటితో 25 సంవత్సరాలు ముగిశాయి..ఈ నేపథ్యంలో ద్రాస్ సెక్టార్‌లో ఉన్న అమర వీరుల స్మారకం వద్ద శుక్రవారంద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు.. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తాను మాట్లాడే ప్రదేశం నుంచి ఉగ్రదాడులకు పాల్పడుతున్న ముఠా నేతలు తన స్వరాన్ని నేరుగా వింటారని,, ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న దేశాలకు ఓ విషయాన్ని చెప్పదలుచుకున్నానని,, ఆ దేశ సంకుంచిత ఆలోచనలు ఎన్నటికీ విజయవంతం కావు అని ప్రధాని తెలిపారు.. పూర్తి స్థాయి దళాలతో ఉగ్రవాదుల్ని మన సైనికులు అణిచివేస్తారని,, శత్రువుకు బలమైన సమాధానం ఇస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు..లడాఖ్ అయినా జమ్మూకశ్మీర్ అయినా అభివృద్ధికి అడ్డు వచ్చే ఎటువంటి సవాల్‌ను అయినా న్యూ ఇండియా ఓడిస్తుందని మోదీ విస్పష్టంగా ప్రకటించారు..ఆర్టికల్ 370ని రద్దు చేసి ఆగస్టు 5వ తేదీ నాటికి అయిదేళ్లు అవుతుందని,, జమ్మూకశ్మీర్ ప్రజలు కొత్త భవిష్యత్తు,, కొత్త కలల గురించి మాట్లాడుకుంటున్నారని తెలిపారు..మౌళిక సదుపాయాల అభివృద్ధి, పర్యాటక రంగం, లడాఖ్, జేకేలో వేగంగా వృద్ధి చెందుతోందన్నారు..కశ్మీర్‌లో కొన్ని దశాబ్ధాల తరువాత సినిమా హాల్‌ను ఓపెన్ చేసినట్లు చెప్పారు..35 ఏళ్ల తరువాత శ్రీనగర్‌లో తాజియా ఊరేగింపు జరిగిందన్నారు.
అంతకు ముందు అమర జవాన్ల సతీమణులు, కుటుంబసభ్యులతో ప్రధాని కొద్దిసేపు ముచ్చటించారు.. యుద్ధంలో మరణించిన సైనికుల ఫోటోలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రధాని మోడీ సందర్శించారు.. వీర సైనికులు ఎలా ఆ కార్గిల్ కొండల్లో పోరాటం చేశారో అనే విషయంను జవాన్లు ప్రధానికి వివరించారు.. కవితల రూపంలో కొందరు ఆ యుద్ధాన్ని వర్ణించారు.