రాష్ట్ర బడ్జెట్ లోటు ఉన్నను అభివృద్ధి, సంక్షేమానికి నిధులు కొరత లేదు-మంత్రి నారాయణ
అమరావతి: రాష్ట్ర బడ్జెట్ లోటు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమానికి నిధులు కొరత లేదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ అన్నారు.ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో స్థానిక ఎమ్మెల్యే, జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడుతో కలిసి పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. మున్సిపల్ హెడ్ వాటర్ వర్క్స్,హిందూ స్మశాన వాటిక, డంపింగ్ యార్డు,హెల్త్ పార్క్, ఉద్యానవనం, కళాక్షేత్రం, అన్న క్యాంటీన్, టిడ్కో ఇండ్ల సముదాయాన్ని మంత్రులు పరిశీలించారు.పాలకొల్లు పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ లో ఉన్న పనులను మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు.ఆ తర్వాత మున్సిపల్ ఆఫీస్ లో అధికారులతో సమీక్ష జరిపారు..ప్రధానంగా టిడ్కో ఇళ్ల వద్ద అవసరమైన మౌళిక వసతులను వేగవంతం చేయాలని, పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు..ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.