విశాఖపట్నం,తిరుపతి, విజయవాడలలో మల్టీప్లెక్స్,హైపర్ మార్కెట్లు-లులూ గ్రూప్!
అమరావతి: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టేందుకు సముఖత వ్యక్తం చేస్తూ సాగర తీరం అయిన విశాఖపట్నంతో పాటు తిరుపతి, విజయవాడలలో అంతర్జాతీయ స్థాయి మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్స్ ను లులూ గ్రూప్ చైర్మన్, ఎండీ యూసఫ్ ఆలీ ప్రారంభించాలని అకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.అదివారం తన స్నేహితుడు అయిన యూసఫ్ ఆలీతో సమావేశం అయిన సీ.ఎం, రాష్ట్రంలో ప్రారంభించే వ్యాపార సంస్థలకు ప్రభుత్వం తరపున అన్ని విధాల సహకారం అందించనున్నట్లు తెలిపారు..వినోద రంగంతో పాటు పుడ్ ప్రాసెసింగ రంగంలో కూడా వారి సంస్థ కార్యకలపాలు విస్తరించాలని కోరారు..రాష్ట్రంలో లులూ గ్రూప్, హైదరాబాద్‌లోని ప్రసాద్ IMAX కంటే మరింత అధునతన హంగులతో మల్టీప్లెక్స్,షాపింగ్ మాల్స్,,ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు తెలుస్తొంది.