తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా భరత్ భూషణ్
హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) నూతన అధ్యక్షుడిగా వైజాగ్‌కు చెందిన భరత్ భూషణ్ ఎన్నికయ్యారు..జూలై 31వ తేదితో నిర్మాత దిల్ రాజు పదవి కాలం పూర్తి అవుతున్న నేపధ్యంలో ఎన్నికలు నిర్వహించారు..ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో ఠాగూర్ మధు,, భరత్ భూషణ్ ప్యానెల్‌లు పోటీ పడ్డాయి..మొత్తం 48 మంది సభ్యుల్లో 46 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు..ఈ ఎన్నికల్లో 29 మంది సభ్యులు భరత్ భూషణ్ కు అనుకూలంగా ఓటు వేయగా, 17మంది ఠాగూర్ మధుకు ఓటు వేశారు.. ఇక మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లు రావడంతో భరత్ భూషణ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.. ఇక గతంలో ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి దిల్ రాజును ఎన్నుకున్న సభ్యులు ఈసారి డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి భరత్ భూషణ్‌ను ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.. ఉపాధ్యక్ష పదవికి అశోక్‌కుమార్, వైవీఎస్ చౌదరి మధ్య పోటీ జరిగింది..ఇందులో ఉపాధ్యక్షుడిగా అశోక్ కుమార్ గెలిచారు.