NATIONAL

డ్రాగన్ కంత్రీకి వెన్నులో వణుకు తెప్పించే “షిన్‌కున్ లా టన్నల్‌”కు శంకుస్థాపన

అమరావతి: డ్రాగన్ కంత్రీ కుయుక్తులకు ధీటుగా జావాబు ఇవ్వడంతో పాటు లడఖ్ రూపురేఖలను పూర్తిగా మార్చివేసే “షిన్‌కున్ లా టన్నల్‌కు” కార్గిల్ దివాస్ వేదిక నుంచి ప్రధాని మోదీ,, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలిసి శంకుస్థాపన చేశారు.. గతేడాది ఫిబ్రవరిలో ఈ సొరంగ మార్గం నిర్మాణానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది..ఈ టన్నెల్ అందుబాటులోకి వస్తే అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ మనాలి నుంచి లేహ్ కు,,దార్చా-పడుమ్-నిమ్ము ద్వారా సులభంగా చేరుకోవచ్చు.. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ షిన్‌కున్ లా పాస్ మార్గం కోసం 15,800 అడుగుల ఎత్తులో 4.1 కిలోమీటర్ల మేర ఈ సొరంగాన్ని నిర్మిస్తారు.. ఈ ట్విన్-ట్యూబ్ సొరంగ మార్గం ప్రాజెక్ట్‌ కు దాదాపు రూ. 1,681 కోట్లు ఖర్చవుతుందని అంచనా..దార్చా-పడుమ్-నిమ్ము రోడ్డు పొడవు 297 కిలోమీటర్లు..ఈ మార్గంలో 100 కిలోమీటర్ల మేరకు ఇప్పటికే బ్లాక్ టాప్ డబుల్ రోడ్డు ఉంది..కొత్త రోడ్డు నిర్మాణం వల్ల మనాలీ-లేహ్ మధ్య దూరంలో పెద్దగా మార్పు ఉండదు.. అయితే మంచు బారిన పడకుండా ఏడాది పొడవునా ప్రయాణించేందుకు వీలవుతుంది..లడఖ్, కార్గిల్, సియాచిన్ సెక్టర్లలో ఉండే భారత సైన్యానికి ఆహారం, ఆయుధాలు మందులు వాటిని సరఫరా చేయడం సులువవుతుంది.. ప్రతి 500 మీటర్లకు క్రాస్ పాసేజి‌లు ఉండే షిన్‌కున్ లా సొరంగం పూర్తి కావడానికి కనీసం 2 సంవత్సరాల సమయం పడుతుంది..చైనాలోని 15,590 అడుగుల ఎత్తులో ఉన్న “మి లా టన్నెల్‌” కంటే “షిన్‌కున్ లా టన్నల్‌” ప్రపంచంలోనే ఎత్తైన సొరంగం మార్గంగా రికార్డు సృష్టిస్తుంది..ఈ టన్నెల్ పూర్తి అయితే లడఖ్‌లో ఆర్థిక, సామాజిక అభివృద్ధి వేగంగా జరుగుతుందని సంబంధిత అధికారి తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *