కడపలో గరిష్ఠంగా 44.4°C నమోదైందు-విపత్తుల నిర్వహణ సంస్థ
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం (23-04-26) రాష్ట్రంలో 95 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 101 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శుక్రవారం 50 తీవ్ర, 52 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం 202 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు పేర్కొన్నారు. ప్రజలు తప్పనిసరిగా ఎండ తీవ్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బుధవారం కడపలో 44.4°C, మన్యం(జి) సాలూరులో 44.1°C, నంద్యాల(జి) ఆళ్లగడ్డలో 44°C, శ్రీకాకుళం(జి) కొత్తూరులో 43.5°C, విజయనగరం(జి) దత్తిరాజేరులో 43.5°C, అనంతపురం(జి) రాయదుర్గంలో 43.4°C, ప్రకాశం(జి) కొప్పెరపాడులో 43.4°C, అనకాపల్లి(జి) దేవరపల్లె, తిరుపతి(జి) బేస్తపల్లి లో 43.3°C, కాకినాడ(జి) కరపలో 43.2°C, విశాఖ(జి) పద్మనాభంలో 43°C, పల్నాడు(జి) గురజాలలో 42.9°C, నెల్లూరు(జి) కొమ్మిపాడు 42.8°C, మార్కాపురం(జి) తిప్పయ్యపాలెం,శ్రీసత్యసాయి(జి) కొత్తచెరువులో 42.5°C, అన్నమయ్య(జి) నూలివీడులో 42.2 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.

