తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో రేపు పోలింగ్
అమరావతి: తమిళనాడులో గురువారం 234 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 234 నియోజకవర్గాల్లో జరగనున్నది.ఈ ఎన్నికల్లో పోటీలో 4,023 మంది అభ్యర్దులు తమ రాజకీయ భవిష్యత్ కోసం ఓటర్ల మందుకు వచ్చారు.5.73 కోట్ల మంది ఓటు వేయనున్నారు.పకడ్బందిగా ఎన్నికల నిర్వహించేందుకు ఎన్నికల కమీషన్ దాదాపు 85,875 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు.
పశ్చిమ బెంగాల్:- బెంగాల్‌లో తొలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనున్నది.75,064 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు-రేపు 16 జిల్లాల్లో 152 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనున్నది. రెండవ విడత ఈ నెల 29న జరగనున్నది. 75,064 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు-చేయగా ఇందులో 8 వేలకుపైగా అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు వున్నాయి. ప్రశాంతగా పోలింగ్ నిర్వహించేందుకు దాదాపు 2.5 లక్షల మంది కేంద్ర బలగాలతో ఈ.సీ.భద్రత ఏర్పాటు చేసింది.ఎన్నికల బరిలో 1,478 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

