ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ లో బయట పడిన మెట్ల బావి
అమరావతి: ఉత్తర ప్రదేశ్ లోని సంభాల్ యొక్క పురాతన చరిత్ర మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతోంది, ప్రతి అధ్యాయం బహిర్గతం చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు..ఇందులో బాగంగా చందౌసిలో పురాతన మెట్ల బావి కనుగొన్నారు..సంభాల్ షాహీజామా మసీదు నుంచి కేవలం 27 కి.మీ దూరంలో ఈ బావి ఉంది..మూడు అంతస్తుల మెట్ల బావిలో ఇప్పటి వరకు నాలుగు గదులు కనిపించాయి..అధికారులు బావి చరిత్ర తెలుసుకునేందుకు తవ్వకం పనులు ఇంకా కొనసాగిస్తున్నారు..150 సంవత్సరాలు క్రిందటి నిర్మించిందా? లేక అంతకు ముందు నిర్మించాదా అనే విషయంపై పురవస్తుశాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు..”మొహల్లా లక్ష్మణ్ గంజ్‌లోని ఒక స్థలం గాటా నంబర్ 253 కింద రిజిస్టర్ చేయబడింది..ఈ బావిని “బావడి” అని పిలుస్తారు..స్థానిక పెద్దలు ఈ స్థలం యొక్క చారిత్రక ప్రాముఖ్యతకు సంబంధించి పూర్వీకుల కథనాలను గుర్తుకు తెచ్చుకుంటు,, మెట్ల బావి, గత యుగం యొక్క అవశేషాలు అని వ్యాఖ్యనిస్తుతున్నారు..బావికి సంబంధించి తవ్వకాలను అధికారులు కొనసాగిస్తున్నారు..మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..