కువైట్ అత్యున్నత పురస్కారం“ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్” అందుకున్న ప్రధాని మోదీ
అమరావతి: భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదివారం కువైట్ అత్యున్నత పురస్కారం “ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్” అందుకున్నారు.. ఈ పురస్కారం స్నేహానికి చిహ్నంగా దేశాధినేతలు,, విదేశీ సార్వభౌమాధికారులు,, విదేశీ రాజ కుటుంబాల సభ్యులకు కువైట్ అందచేస్తుంది..ఈ పురస్కారాన్ని గతంలో బిల్ క్లింటన్, ప్రిన్స్ చార్లెస్, జార్జ్ బుష్ వంటి నేతలుకు ప్రధానం చేశారు..
రెండు రోజుల ప్రర్యాటనలో బాగంగా ప్రస్తుతం ప్రధాని మోదీ కువైట్ పర్యటనలో ఉన్నారు..కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్ సబాహ్ చేతుల మీదుగా ముబారక్ అల్-కబీర్ ఆర్డర్‌ను పొందడం ఓ గౌరవంగా భావిస్తున్నానని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యనించారు..తాను ఈ గౌరవాన్ని భారతదేశ ప్రజలకు,, భారత్-కువైట్ మధ్య ఉన్న బలమైన స్నేహానికి అంకితం చేస్తున్నానని తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు..
అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ క్రౌన్ ప్రిన్స్ సబా అల్-ఖలీద్ అల్-సబాతో సమావేశమయ్యారు.. కువైట్ ఎమిర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.. “కువైట్ ఎమిర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్ సబాతో అద్భుతమైన సమావేశం జరిగిందని,, రెండు దేశాల మధ్య ఫార్మాస్యూటికల్స్, ఐటి, ఫిన్‌టెక్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, భద్రత వంటి కీలక రంగాలలో సహకారం గురించి చర్చించామన్నారు..సన్నిహిత దేశాలకు పాలసీలకు అనుగుణంగా సంబంధాలు, భాగస్వామ్యాన్ని వ్యూహాత్మక స్థాయికి పెంచామని, రాబోయే కాలంలో రెండు దేశాల మధ్య స్నేహం మరింత పెరుగుతుందని ఆశాభావంతో ఉన్నామని రెండు దేశాల అధినేతలు స్పష్టం చేశారు..తన పర్యాటన తరువాత, భారతదేశం-కువైట్ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు కూడా జరిగాయి.