D MARTలో నాణ్యత కోల్పోయి లయన్ డేట్స్ ప్యాకెట్లు విక్రయం-MHO డాక్టర్ చైతన్య
బ్రెడ్ ప్యాకెట్స్ ఎక్స్పైరీ డేట్..
నెల్లూరు: నగరంలోని ప్రముఖ వ్యాపార సంస్థ డి మార్ట్ లో విక్రయిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించేందుకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వెంకటేశ్వరరావులు సంయుక్తంగా శనివారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారుల ఫిర్యాదు మేరకు D MARTలో ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేస్తున్నామని, అందులో భాగంగా ఎక్స్పైరీ డేట్ ఉన్నప్పటికీ లయన్ డేట్స్ ప్యాకెట్లు నాణ్యత కోల్పోయి వినియోగించడానికి పనికిరానివిగా ప్రాథమికంగా తేల్చామని తెలిపారు. ప్యాకెట్లను తమతో తీసుకెళ్లి ల్యాబ్ ల ద్వారా పరీక్షలు నిర్వహించి తదుపరిచర్యలు తీసుకోనున్నామని వారు స్పష్టం చేశారు. అదేవిధంగా బ్రెడ్ ప్యాకెట్స్ ఎక్స్పైరీ డేట్ రేపటికి ఉండగా ఈరోజు కూడా వినియోగదారులకు అందుబాటులో ప్రదర్శించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నామని వారు తెలిపారు. పూర్తిస్థాయి నివేదిక అందుకున్న తర్వాత తగిన నోటీసులు జారీ చేసి సంస్థ పై చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చైతన్య, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటేశ్వరరావు లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ నరసింహారావు, సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.