రామయణం,,మహాభారతాని కువైట్ సమాజం-ప్రధాని మోదీ
కువైట్ లో మినీ ఇండియా కన్పిస్తొంది..
అమరావతి: భారతీయులు కువైట్ వస్తూ కువైట్ సమాజానికి భారతీయతను పరిచయం చేశారని ప్రవాస భారతీయులను ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు..భారతీయులు కువైట్ వస్తూ భారతదేశ ప్రతిభ, సాంకేతికత, సంప్రదాయాలను మేళవించి కువైట్ నేలను నైపుణ్య రంగులతో నింపారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు..రెండు రోజుల కువైట్ పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులతో శనివారం సాయంత్రం నిర్వహించిన ‘హలా మోదీ’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.. మీరంతా కష్టపడి పనిచేస్తూ,భారతదేశంలోకి మీరు పంపిస్తూన్న విదేశీ కరెన్సీ కారణంగా మన దేశ విదేశీ మారక నిల్వలు పెరుగుతున్నాయని భారత సంతతిని ప్రధాని మోదీ ప్రసంశించారు.. కువైట్-భారత్ మధ్య ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూనే వస్తున్నాయని,, ఈ దేశ నేతలతో ఎప్పుడు సంభాషించిన భారతీయుల గురించి ప్రశంసిస్తుంటారని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు..ఇరు దేశాలు అరేబియా సముద్రానికి రెండు వైపులా ఉన్నాయని,, కేవలం దౌత్య సంబంధాలే కాకుండా హృదయం సంబంధాలు ఇరుదేశాలను దగ్గర చేస్తున్నాయన్నారు.. భారత్‌లోని స్టార్టప్‌లు, సాంకేతక నైపుణ్యాలు కువైట్ అవసరాలకు నూతన పరిష్కారాలను చూపించగలవని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కువైట్‌లో పర్యటించడం ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నానని,, 43 సంవత్సరాల తరువాత ఒక భారతదేశ ప్రధాన మంత్రి ఈ నేలప అడుగు పెట్టారన్నారు..భారతదేశం నుంచి కువైట్ రావడానికి నాలుగు గంటలే సమయం పడుతుందని,,ఇదే సమయంలో ఇక్కడికి రావడానికి భారతదేశ ప్రధానికి నాలుగు దశాబ్దాలు పట్టిందని చెప్పారు.. రెండున్నర గంటల క్రితమే ఇక్కడకు వచ్చాయని, ఇక్కడకు అడుగుపెట్టినప్పటి నుంచి ఎంతో ఆప్యాయతా అనురాగాలు తన చుట్టూరా ఉన్న అనుభూతి కలుగుతోందన్నారు..ఇక్కడున్న వారంతా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారని, అందర్నీ చూస్తుంటే మినీ ఇండియా కన్పిపిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.