సినిమా ఇండస్ట్రీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
హైదాబాద్: తెలంగాణలోఇక నుంచి టికెట్ ధరల పెంపు, బెనిఫిట్‌షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అనుమతి ఇవ్వబోనని,,కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం సినిమా వాళ్ల ఆటలు సాగనివ్వనని హెచ్చరించారు..సినిమా వాళ్లు తెలంగాణలో వ్యాపారాలు చేసుకోండి అంతే కాని మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూస్తే ఊరుకోమని తేల్చి చెప్పారు.. చట్టం అందరికీ ఒక్కటే అనే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు..హీరో అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ప్రవర్తించాయని,, పలువురు నాయకులు చేసిన కామెంట్స్ ను ఆయన అసెంబ్లీలో గుర్తు చేశారు.. తనను నీచంగా తిట్టుకుంటూ పోస్టులు పెట్టారన్నారు.. మంత్రిగా పని చేసిన ఒక వ్యక్తి అడ్డమైన పోస్టులు పెట్టారన్నారు..ఆల్లు.ఆర్జన్ భగవత్ స్వరూపుడు అన్నట్లుగా హంగామా చేశారని విమర్శించారు..ప్రజల ప్రాణాలు తీస్తుంటే సినిమా వాళ్లను ఏం చేయొద్దా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.. ఫిల్మ్ స్టార్స్,,పొలిటికల్ స్టార్స్ కు ప్రత్యేక ప్రివిలేజ్ ఉందా? అని సీఎం ప్రశ్నించారు.