పర్యావరణంను మనం కాపాడుకోలేక పోతే-భూమే ఏదొకనాటికి మనలను సొంతం చేసుకుంటుంది-పవన్
అమరావతి: పరిశ్రమల ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో విజయవాడలో వర్కుషాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు నిపుణులు, మేధావులు, ఎన్జీవోల సూచనలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ వర్కుషాపు ద్వారా పరిశ్రమల ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణ రెండు అంశాలపై వేసే అడుగులపై అందరికీ స్పష్టత వస్తుందన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో ఎంతవరకు కాలుష్యాన్ని నియంత్రించాలనే అంశంపై ఆలోచన చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో విజయవాడలో వర్కుషాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీసీబీ ఛైర్మన్ ఈ వర్కుషాపును ఏర్పాటు చేయడం, అన్ని రంగాల నిపుణులు, ఎన్జీవోలను ఆహ్వానించడం అభినందనీయం. నేను పర్యావరణ ప్రేమికుడిని, ప్రకృతి బాగుండాలని కోరుకునే వ్యక్తిని, ప్రకృతి ప్రేమికులు ఎంత తపన పడతారో నాకు తెలుసు అన్నారు. భూమి మీద కనీస బాధ్యత లేకుండా మనం జీవనం సాగిస్తున్నామని,, భూమిని మనం సొంతం చేసుకోవడం కాదు, భూమే ఏదొకనాటికి మనలను సొంతం చేసుకుంటుందన్నారు..రాష్ట్రంలో 974 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉంది.. దానిని అభివృద్ధి చేయాలి. పర్యావరణ సమతుల్యత దెబ్బ తినకుండా.. పరిశ్రమల ఏర్పాటు కావాలి. భవిష్యత్ తరాల కోసం.. మనమంతా ఇప్పటి నుంచే ఆలోచన చేయాలి. జల, వాయి కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి’’ అని పిలుపునిచ్చారు.