రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల టన్నుల చెత్త తొలగించాం-మంత్రి నారాయణ
రాజధాని నిర్మాణ పనులల్లో వేగం పెంచుతాం..
తిరుపతి: రాజధాని నిర్మాణ పనులల్లో వేగం పెంచుతామని పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖామంత్రి పొంగూరు నారాయణ చెప్పారు.. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్నా పథకాలను కొనసాగిస్తున్నామని తెలిపారు.తిరుపతి సమీపంలోని రామాపురం వద్ద లెగసీ వేస్ట్ ప్లాంట్ ను మాజీ ఎమ్మెల్యే సుగుగుణమ్మ ,కార్పొరేషన్ అధికారులతో కలిసి శనివారం మంత్రి నారాయణ పరిశీలించారు.అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి 10 లక్షల కోట్ల అప్పులు వదిలి వెళ్ళడం మాత్రమేనని ఎద్దేవా చేశారు.
ఎపిలో 85 లక్షల టన్నుల చెత్తను వైఎస్సార్సీపీ వదిలేస్తే,తమ ప్రభుత్వం ఎపిని స్వచ్ఛాంద్రగా మారుస్తుస్తుందన్నారు. ఇప్పటి వరకు 50 లక్షల టన్నుల చెత్త తొలగించామని,మరో మూడు నెలల్లో 35 లక్షల టన్నుల చెత్త తొలగిస్తామన్నారు. తిరుపతిలో రోజుకు 2500 టన్నులు చెత్త ప్రాసెస్ చేయాల్సి వుండగా కాంట్రాక్ట్ సంస్థ 900 టన్నులు మాత్రమే ప్రాసెస్ చేస్తోందన్నారు. అదనంగా మరిన్ని యంత్రాలు పెట్టి చెత్తను ప్రాసెస్ చేయాలని ఆదేశించామన్నారు. మహిళలకు ఆగష్టు 15వతేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామాని తెలిపారు. అన్నక్యాంటీన్ ద్వారా రోజుకు 2 లక్షల 20వేలమందికి ప్రతిరోజు భోజనం అందిస్తున్నామని చెప్పారు.టిడ్కో బాధితులను ఆదుకుంటామన్నారు. కొంత మంది ఎసి రూమ్స్ లో కూర్చుని మాట్లాడటం కాదని, రాజధానికి వచ్చి జరుగుతున్న పనులు చూడాలని చురకలు అంటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్,సిబ్బంది,టీడీపీ నేతలు పాల్గొన్నారు .