వివాదస్పద డైరక్టర్ రామ్ గోపాల్ వర్మకు 3 నెలలు జైలు శిక్ష విధించిన కోర్టు
హైదరాబాద్: వివాదస్పద డైరక్టర్ రామ్ గోపాల్ వర్మకు కోర్టు శిక్ష విధించింది.. ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేలుస్తూ మూడు నెలల జైలు శిక్ష విధించింది.. 2018లో మహేశ్ చంద్ర అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుతో వర్మపై కేసు నమోదు అయింది..కోర్టు నుంచి ఎన్ని సార్టు సమన్లు వచ్చిన ఒక్కసారి కూడా వర్మ విచారణకు హాజరుకాలేదు.. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం ఆయనకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.. ఫిర్యాదుదారునికి 3 నెలల్లో రూ.3.72లక్షల పరిహారం ఇవ్వాలని,, లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది.. గత 7 సంవత్సరాలుగా ఈ కేసుపై కోర్టులో వాదనలు జరుగుతున్నా ఏనాడూ కోర్టుకు హాజరుకానీ ఆర్జీవీ ఈ తీర్పుపై ఎలా స్పందిస్తారో చూడాలి..