అర్బన్ అథారిటీలపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా..పొంగూరు.నారాయణ సమీక్ష
అమరావతి: బుధవారం కర్నూలు,అనంతపురం-హిందూపురం,కడప అర్బన్ అథారిటీలపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా..పొంగూరు.నారాయణ సమీక్ష నిర్వహించారు..సంబంధిత యూడీఏల పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు..డిశంబరు నెలాఖరు నాటికి అవసరమైన స్థలాలు గుర్తించాలని, మూడు యూడీఏల వీసీలకు ఆదేశాలివ్వడం జరిగింది.. యూడీఏలకు నోడల్ అధికారిగా పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్ నియామకం చేసి యూడీఏల ఆదాయంలో 50 శాతం మున్సిపాల్టీల అభివృద్దికి కేటాయించాలని నిర్ణయించారు. అర్బన్ అథారిటీల ఆధ్వర్యంలో ఎంఐజీ,హెచ్ ఐజీ ఇళ్ల నిర్మాణంతో పాటు యూడీఏలకు ఆదాయం వచ్చేలా టూరిజం ప్రాజెక్ట్ లపై దృష్టి సారించాలని నిర్ణయించడం జరిగింది.