AP&TG

తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు,ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం 7.26 గంటలకు పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి.. దీంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు,,అపార్ట్‌ మెంట్ల నుంచి ప్రజలు భయంతో రోడ్డుపైకి వచ్చేశారు..విజయవాడలో దాదాపు 5 సెకండ్ల పాటు భూమి కంపించింది..అలాగే జగ్గయ్యపేట పట్టణం, పరిసర గ్రామాల్లో,,ఎన్టీఆర్ జిల్లా నందిగామ,, తిరువూరు నియోజకవర్గాల్లోని గంపలగూడెం విస్సన్నపేట మండలాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి.. రంగారెడ్డి,, భద్రాద్రి కొత్తగూడెం,, యాదాద్రి,, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి 2 సెకన్లపాటు కంపించింది..భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ స్పల్ప భూప్రకంపనలు సంభవించాయి.. తెలంగాణలోని ములుగు కేంద్రంగా ఉదయం 7.27 గంటలకు స్వల్ప భూప్రకంపనలు సంభవించిందని అధికారులు గుర్తించారు..ప్రకంపనలు రిక్టర్స్ స్కేలుపై 5.3 గా నమోదైంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *