AP&TG

మీడియా సమావేశంలో ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసిన జగన్

అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దైంది..వైసీపీ ప్రభుత్వం హాయంలో తిరుమల లడ్డూకు సరఫరా చేసిన నెయ్యిలో కాల్తీ జరిగిన సంఘటనపై శ్రీవారిని దర్శించుకుంటాను అంటూ శుక్రవారం తిరుపతికి చేరుకునేందుకు సిద్దం అయ్యారు..అయితే శ్రీవారిని దర్శించుకునేందుకు ముందు అన్య మతస్థులు టీటీడీ దేవస్థానంకు ఇచ్చే డిక్లరేషన్ ఇచ్చిన తరువాతే,దర్శనానికి వెళ్లాంటూ హిందు సంస్థలు,, పీఠాధిపతులు,, ఎన్డీఏ నాయకులు పట్టుపట్టారు..డామిట్ కథ అడ్డం తిరిగిందని తెలుసుకున్న జగన్ తన తిరుమల పర్యటలన రద్దు చేసుకుని,,మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.. మీడియా సమావేశంలో ఎక్కడ “తను తిరుమల పర్యటనకు వస్తాను,,డిక్లషన్ పై సంతకం చేస్తాను అని ప్రస్తవనకు తీసుకుని రాలేదు”..అయితే తాను సీ.ఎంగా వున్న సమయంలో శ్రీవారి బ్రహోత్సవాలకు పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు డిక్లరేషన్ ప్రస్తవన రాలేదన్నారు..ఇక్కడ గమనించాల్సి విషయం,, ముఖ్యమంత్రి స్థాయిలో స్వామివారికి పట్టు వస్త్రాలు సతీసమేతంగా సర్పించాల్సి వుంటుంది..అయితే ఏనాడు జగన్ తన సతీమణి భారతితో శ్రీవారి దర్శనానికి రాలేదు..అలాగే అన్యమతస్థుడు అయిన సీ.ఎం,, పట్టువస్త్రాలు సమర్పించే సమయంలో కూడా డిక్లరేషన్ పై సంతకం చేయాల్సి వుంటుంది..ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని డిక్లరేషన్ పై సంతకం చేయమని అడిగే స్థాయి,టీటీడీ ఛైర్మన్ కు వుంటుందా? అది కూడా జగన్,నామినేట్ చేసిన వ్యక్తే ఛైర్మన్ అయినప్పడు ? ఇలాంటి విషయాలు ప్రక్కన పెట్టి,,జగన తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు, ప్రభుత్వంపై ఎదురుదాడికి జగన్ దిగాడంటూ పీఠాధిపతులు మండిపడుతున్నారు..వైసీపీపార్టీ నుంచి నాయకులు ఇతర పార్టీకి వెళ్లిపోతున్న సమయంలో,,వైసీపీ అధినేతకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని,,ఈ పరిస్థితిని నుంచి ప్రజల చూపును దారి మళ్లీంచేందుకే,,జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకుని,,అబద్దాలతో మీడియా సమావేశం ఏర్పటు చేశాడని ఎన్డీఏ నాయకులు మండిపడుతున్నారు..మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందొ వేచి చూడాలి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *