జగన్ పాస్‌పోర్టు కాలపరిమితిని ఒకటి నుంచి 5 సంవత్సరాలకు పెంచుతూ హైకోర్టు అదేశాలు
అమరావతి: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పాస్‌పోర్టు విషయంలో హైకోర్ట్ లో స్వాంతన లభించింది..విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు విధించిన పాస్‌పోర్టు కాలపరిమితిని ఒక సంవత్సరం నుంచి 5 సంవత్సరాలకు పెంచుతూ హైకోర్టు బుధవారం ఆదేశాలు ఇచ్చింది..అయితే విజయవాడ కోర్టు ఆదేశాల ప్రకారం ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్లి రూ.20 వేల పూచీకత్తు స్వయంగా సమర్పించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.. ట్రయల్ కోర్టు విధించిన మిగిలిన షరతులు అన్నీ యథావిథిగా ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది..సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పరాజయంతో జగన్‌కు గతంలో ఇచ్చిన డిప్లమేట్ పాస్‌పోర్టు రద్దయిపోయింది.. అక్రమాస్తుల కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చే సమయంలో, కోర్టు జగన్‌కు ఏడాది కాలానికి మాత్రమే సాధారణ పాస్‌పోర్టు ఇవ్వాలని ఆదేశించింది..ఈ సందర్భంగా పలు షరతులు విధించడంతో ఆయన హైకోర్టును అత్యవసరంగా ఆశ్రయించారు..