AP&TG

శనివారం సాయంత్రానికి మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే అవకాశం

అమరావతి: నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన తుఫాను “ఫెంగల్” గత 6 గంటల్లో 12 kmph వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న ఫెంగల్ ప్రస్తుతానికి పుదుచ్చేరికి 150కి.మీ, చెన్నైకి140కి.మీ దూరంలో కేంద్రీకృతం వుందని వాతావరణశాఖ వెల్లడించింది..శనివారం సాయంత్రానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల దగ్గర కారైకాల్-మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపానుగా తీరం దాటే అవకాశం వున్నట్లు తెలిపింది..మధ్యాహ్నం సమయంలో గంటకు 70-80 కి.మీ వేగంతో గంటకు 90 కి.మీ వేగంతో గాలులతో తుఫానుగా కదులుతుందని పేర్కొంది..ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి,దక్షిణ కోస్తా ప్రాంతాలకు వాతావరణశాఖ రెడ్ మెసేజ్ ని విడుదల చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *