తిరుపతి నుంచి ముంబైకి నేరుగా ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం
తిరుపతి: ఆదివారం నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్,ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పారవిమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో తిరుపతి నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించడం జరిగిందని తిరుపతి విమానాశ్రయ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు..ఈ సందర్భంగా తిరుపతి విమానాశ్రయ డైరెక్టర్ మాట్లాడుతూ, ఫ్లైట్ నంబర్ 6E532 ముంబై నుంచి తిరుపతికి విమానం ఉదయం 05:30 గంటలకు బయలుదేరి, 07:15 గంటలకు తిరుపతికి చేరుకుంటుందనీ,,తిరిగి ఫ్లైట్ నంబర్ 6E533 తిరుపతి నుంచి ముంబయికి విమానం ఉదయం 07:45 గంటలకు బయలుదేరి 9.25 గం.లకు ముంబయికి చేరుకుంటుందన్నారు..ఈ విమాన సర్వీసు వారానికి ఏడు రోజులు అందుబాటులో ఉంటుందని తెలిపారు..