హంటర్ బైడెన్‌కు జోబైడెన్ క్షమాభిక్ష ప్రసాదించడం రాజ్యంగ విరుద్దం-ట్రంప్
అమరావతి: అక్రమంగా తుపాకీ కొనుగోలు, ఆదాయపు పన్ను విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని డెలావెర్, కాలిఫోర్నియాలో హంటర్ బైడెన్‌పై కేసులు నమోదు అయ్యియ..ఆయుధం కొనుగోలు వ్యవహారంలో నమోదైన కేసులో హంటర్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చినప్పటికి శిక్ష మాత్రం ఖరారు చేయలేదు..మరో 50 రోజుల్లో పదవి నుంచి వైదొలగనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనకున్న అధికారాలతో,, కోర్టులు దోషిగా నిర్దారించిన హంటర్‌కు,, బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించారు..జో బైడెన్ నిర్ణయంపై డొనాల్డ్ ట్రంప్ త్రీవంగా స్పందిస్తూ,, ఇది పూర్తిగా న్యాయవిరుద్ధమైందని,, బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తీవ్రంగా మండిపడ్డారు..
ఈ విషయమై తన ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ ఓ పోస్టు చేస్తూ “హంటర్‌కు క్షమాభిక్ష ప్రసాదించినట్లే 4 సంవత్సరాలుగా జైళ్లలో మగ్గుతున్న J-6 బందీలకు ఎందుకు ఉపశమనం కల్పించలేదు..? కుమారుడి విషయంలో బైడెన్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా న్యాయవిరుద్ధం,, అధికార దుర్వినియోగం”అని పేర్కొన్నారు..(2020లో అమెరాకలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అవకతకవకలు జరిగాయని,,ఇందుకు నిరసనలు తెలపాలన్న ట్రంప్ పిలుపుతో 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్‌లో అల్లర్లలో పాల్గొన్నవారు.) బైడెన్ విజయాన్ని ధ్రువీకరించేందుకు వాషింగ్టన్ క్యాపిటల్ భవనంలో కాంగ్రెస్ సమావేశమైన సమయంలో ట్రంప్ మద్దతుదారులు వేలాదిగా క్యాపిటల్ భవనంలోకి దూసుకొచ్చి విధ్వంసం సృష్టించారు.. ప్రస్తుతం అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయే సమయంలో కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశాన్ని జో బైడెన్ వినియోగించుకున్నారు.. బైడెన్ నిర్ణయంపై అమెరికా ప్రజల్లో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.