బుల్లితెర నటీ శోభిత ఆత్మహత్య
హైదాబాద్: టీడీ సిరీయల్స్ నటి శోభిత శివానీ హైదరాబాద్, గచ్చిబౌలి శ్రీరామ్ నగర్ కాలని సిబ్లాక్ లో తన ఇంట్లో ఫ్యాన్ కు ఊరివేసుకోని ఆత్మహత్య చేసుకుంది..కన్నడ సినీమారంగానికి చెందిన శోభిత కన్నడతోపాటు తెలుగులోనూ పలు సీరియల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది..శోభిత ఆత్మహత్య సమాచారం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు, సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు,,గత సంవత్సరం సుధీర్ ను వివాహం చేసుకున్నారు.. సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న శోభిత,, ఇప్పుడు తన భర్త సుధీర్ తో కలిసి శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు..వివాహం తరువాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది..పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని బెంగుళూరు తరలించనున్నట్లు సమాచారం.. ఆమె మృతి పట్ల సినీ,,టీవీ సీరియల్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.