కష్టపడి పనిచేసుకునే వాడికి కొపం తెప్పించ వద్దు-వైసీపీ నాయకులకు పవన్ కళ్యాణ్ హితవు
నేను సినిమా ఇండ్రస్ట్రీ నుంచి వచ్చిన వాడిని ఇక్కడ సినిమా డైలాగులు చెప్పను…
అమరావతి: దశాబ్దలుగా వెలిగొండ ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు…యువతలో అవేదన,కోపం,బాధ నన్ను కలిచివేస్తున్నాయి….గొంతు ఎండిపోతుంది.పశువులు నీళ్లు లేక చచ్చిపోతున్నాయి…గుక్కెడు నీళ్లు ఇమ్మంటూ ప్రకాశం జిల్లా ప్రజలు,రైతులు వేడుకుంటున్న గత పాలకులు ఎందుకు స్పందిచలేదొ నాకు ఆర్దం కావడంలేదంటూ ఉపముఖ్యమంత్రి అవేదన వ్యక్తం చేశారు…శుక్రవారం ఉప ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజక వర్గం నరసింహపురంలో రూ.1290 కోట్ల విలువైన తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు..అనంతరం అయన బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రకాశం జిల్లా వాసుల సాగు,త్రాగు నీరు సమస్యను తీర్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశ పెట్టిన జల్ జీవన్ మిషన్ ద్వారా రూ.1290 కోట్లు తొలి విడత పనులను పూర్తి చేసేందుకు ప్రారంభొత్సవం చేసే అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాను అని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు..ప్రకాశం జిల్లా మార్కపూరంలో 7 నియోజకవర్గాలకు త్రాగు నీరు అందించే జల్ జీవన్ మిషన్ కు శంకుస్థాపన చేశారు..2029లో మేం అధికారంలోకి వస్తే అంతు చూస్తాం అంటూన్న వాళ్లు అధికారంలోకి రావాలి కదా.?మీరు ఎలా వస్తారో మేము చూస్తాం….? వైసీపీ నాయకులు కాని మాజీ సీ.ఎం జగన్ పైన కూడా నాకు వ్యక్తి గతం ఎలాంటి కోపం వుండదు నా ఆత్మసాక్షిగా చెపుతున్నా అని అన్నారు..మీరు భయపిస్తే భయపడేంత పిరికి వాళ్లు ఇక్కడ ఎవ్వరు లేరు….నేను రెండు దగర్ల ఓడిపోయిన కూడా బలంగా మిమల్ని ఎదుర్కొనే కదా ఈ స్థాయికి వచ్చింది..నేను సినిమా ఇండ్రస్ట్రీ నుంచి వచ్చిన వాడిని రాజకీయల్లో సినిమా డైలాగు చెప్పను అన్నారు….కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం అన్నారు.