మణిపూర్ లో భద్రతా దళాలు తకిఖీలు-భారీ ఎత్తున ప్రేలుడు,మారణయుధాలు స్వాధీనం
అమరావతి: మణిపూర్ ప్రాంతంలో ఉద్రికత్తలను పెంచి,,మారణకాండకు పాల్పపడేందుకు కుకీ తెగలకు చెందిన ఆసాంఘిక శక్తులు,,మైతీలపై దాడులకు దిగేందుకు, భారతదేశంకు సరిహద్దు వున్న పొరుగు దేశాల సహకారంతో సిద్దం అవుతున్నాయి..ఈ ప్రాంతాంలో శాంతిని నెలకొల్పడంతో వీరికి ఇష్టం లేదు..ఎందు కంటే కొండ ప్రాంతాల్లో ఓపిఎం,,గంజాయి,హెరాయిన్,,అయుధాల స్మగ్లింగ్ కొన్ని దశాబ్దలుగా కొనసాగుతొంది..కేంద్ర ప్రభుత్వం, ఆసాంఘిక శక్తులను ఏరివేసేందుకు కఠినమైన చర్యలు చేపట్టింది..ఈ నేపధ్యంలో….
మణిపూర్ కొండ ప్రాంతాల్లో నివసిస్తూన్న కూకీ తెగలకు చెందిన ఆసాంఘిక శక్తులు,,వివిధ మార్గలో సేకరించుకున్న పలు మారణ అయుధలను ప్రభుత్వంకు స్వాధీనం చేయాలని గవర్నర్ భల్లా,, ఆసాంఘిక శక్తులను హెచ్చరించారు..ఆయుధాలను స్వాధీనం చేసేందుకు తొలుత ఫిబ్రవరి 20 వరకు అటు తరువాత మార్చి నెల వరకు గడవు విధించాడు..అయితే కుకీ తెగలకు చెందిన ఆసాంఘిక శక్తులు అయుధాలను స్వాధీనం చేయకుండా,, మరిన్ని అయుధాలను సమకుర్చుకుంటున్నాయని పోలీసులకు సమాచారం అందింది..దింతో మణిపూర్ పోలీసులు, అస్సాం రైఫిల్స్, ఆర్మీ, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్‌తో సహా మణిపూర్‌లోని భద్రతా దళాలు గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కొండ జిల్లాల్లో సమన్వయంతో తనిఖీలు నిర్వహించాయి..
ఆసాంఘిక శక్తులు దాచిపెట్టిన ఆయుధాలు,,ప్రేలుడు పదార్దాల గురించి నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, టెంగ్నౌపాల్, కాంగ్పోక్పి, చందేల్, చురాచంద్పూర్ జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు భద్రత దళలు ప్రారంభించాయి..
INSAS రైఫిల్స్, AK సిరీస్, SLRలు, స్నిపర్ రైఫిల్స్, కార్బైన్‌లు, పిస్టల్స్, గ్రెనేడ్ లాంచర్లు సహా 203 ఆయుధాల భారీ డంప్ లను భద్రత దళాలు స్వాధీనం చేసుకున్నాయి..అలాగే “స్థానికంగా తయారు చేసిన తుపాకులతో పాటు 5.56 mm,,7.62 mm రౌండ్ల బుల్లెట్లు, IEDలు, గ్రెనేడ్లు,,పాంపి షెల్స్” వంటి వివిధ రకాల మారణఅయుధాలు,,పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.సంబంధిత వ్యక్తుల కోసం గాలింపులు జరుగుతున్నాయని భద్రత దళాల అధికారి పేర్కొన్నారు..