రోటరీ క్లబ్ కృషితో దేశ,ప్రపంచ వ్యాప్తంగా పోలియో కేసుల సంఖ్య 99 శాతం తగ్గాయి-వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
తిరుపతి: రోటరీ క్లబ్ కృషి వలన దేశ,ప్రపంచ వ్యాప్తంగా పోలియో కేసుల సంఖ్య 99 శాతం తగ్గాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు..బుధవారం స్థానిక శిల్పారామంలో రోటరీక్లబ్ ఆధ్వర్యంలో 29,30 తేదీలలో నిర్వహిస్తున్న జ్ఞాన క్రియ సమ్మేళనం 41వ జిల్లా సమావేశంలో మొదటి రోజు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు..ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రోటరీ క్లబ్ కు సంబందించిన ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్ర సభ్యులకు అలాగే రాయలసీమ, కడప జిల్లా, ప్రొద్దుటూరుకు చెందిన రోటరీ జిల్లా గవర్నర్ గా ఎన్నికైన సాదు గోపాల కృష్ణలకు శుబాకాంక్షలు తెలిపారు.మనం దేశం మొదట, పార్టీ తరువాత, నేను చివర అనే సిద్దంతంతో ముందుకెళ్లాలని సూచించారు.. ప్రతి ఒక్కరు వారి స్వార్థం కోసం కాకుండా దేశం కోసం ఆలోచించాలని అప్పుడే దేశం బాగుంటుందని, ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాలని కోరారు.