క్రిటికల్ మినరల్స్ రంగంలో దేశం స్వావలభనం సాధించడమే లక్ష్యం-కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
అమరావతి: ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో దేశం స్వావలభనం సాధించడం,, ఖనిజాల దిగుమతులపై ఆధారపడటం తగ్గించడం లక్ష్యంగా కేంద్రప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుంచి పలు చర్యలు చేపట్టిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.. బుధవారం ప్రధాని మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వెల్లడించారు..నేషనల్ క్రిటికల్ మినరల్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.. ఈ పథకం కోసం రూ.16,300 కోట్లు కేటాయించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు.. ఇందులో భాగంగా 24 విలువైన ఖనిజాల తవ్వకాలకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు.. ఈ రంగంలో స్వావలంభన సాధించాలనే లక్ష్యంకు అనుగుణంగా 2024-25 బడ్జెట్‌లో క్రిటికల్ మినరల్ మిషన్ ఏర్పాటును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని గుర్తు చేశారు.. అరుదైన ఖనిజ వనరులు ఉన్న దేశాలతో వాణిజ్యాన్ని మెరుగుపరచుకోవడం,, దేశీయంగా ఖనిజ నిల్వల అభివద్ధికి దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు,, ప్రైవేటీ కంపెనీలను నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ప్రోత్సిహిస్తుందని మంత్రి చెప్పారు..2022-23 ఇథనాల్ సరఫరా (నవంబర్-అక్టోబర్) ధరలను పెంచలేదు.. చెరకు రసం,, బి-భారీ బెల్లం,, సి-భారీ బెల్లం నుంచి ఉత్పత్తి చేసిన ఇథనాల్ ధరలు వరుసగా లీటరుకు రూ.65.61, రూ.60.73, రూ.56.28గా ఉన్నాయి..ఈ ధరలను సవరిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది..