నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలు రూ.142 కోట్లు లబ్ధి పొందారు-ఈడీ
అమరావతి: నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు రూ.142 కోట్ల “నేర ఆదాయం” నుంచి లబ్ది పొందారని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు తెలియజేసింది.. ED తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ SV రాజు మాట్లాడుతూ, నవంబర్ 2023లో నేషనల్ హెరాల్డ్ తో ముడిపడి ఉన్న రూ.751.9 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసే వరకూ ఆ నేరం ద్వారా వచ్చిన (అద్దెలు) ఆదాయాన్ని సోనియా, రాహుల్ అనుభవించారని కోర్టుకు తెలిపారు..నేర ఆదాయం”లో షెడ్యూల్ చేయబడిన నేరం ద్వారా పొందిన ఆస్తులు మాత్రమే కాకుండా ఆ ఆదాయానికి సంబంధించిన ఇతర నేర కార్యకలాపాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు..ఈడీ తరపు ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హుస్సేన్, ఆయా ఆస్తుల్లో అద్దెకు ఉంటున్న వారు తమకే ఆ మొత్తాన్ని చెల్లించాలని సూచించారని,, అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ (8) నిబంధన 5(1) ప్రకారం జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు..సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సుమన్ దూబే, సామ్ పిట్రోడా విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.