బంగాళాఖాతంలో తుపాన్, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు
పశ్చిమమధ్య బంగాళాఖాతం,ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా,రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం & ద్రోణి ప్రభావంతో బుధ,గురువారలు మేఘావృతమైన వాతావరణంతో పాటు భారీవర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.. నైరుతీ రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు..ప్రస్తుతం నైరుతీ రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాతాలకు విస్తరిస్తాయన్నారు.. అలాగే శ్రీలంక కింద ప్రాంతం, మాల్దీవులు, బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రం అంతటా నైరుతీ రుతుపవనాలు విస్తరిస్తున్నాయని,, రానున్న రెండు మూడు రోజుల్లో ఇవి మధ్య బంగాళాకాతంలోకి కూడా వస్తాయని తెలిపారు.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఉండటంతో మేఘాలు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో మొదలై,, 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయని,,మరో ఆవర్తనం…. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిందన్నారు.. ఇది కోస్తాంధ్రకు దగ్గరలోనే ఉన్నదని,, దీని వల్ల సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులోని ఆవర్తనం త్వరలో అల్పపీడనంగా మారి తర్వాత తుపానుగా మారుతుందని అంచనా వేస్తున్నారు..ఈ తుఫాన్ కు శక్తి అనే పేరును పెట్టి వున్నారు… ఈ శక్తి తుపాన్ వచ్చే రెండు వారాలపాటూ ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు..రాబోయే వారం రోజులపాటు ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయి.. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయి.. గాలి వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు ఒక్కోసారి గంటకు 70 కిలోమీటర్ల వరకు ఉంటుందని ఐఎండీ తెలిపింది..అత్యవసర సహాయం,సమాచారం కొరకు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్స్ 1070, 112, 18004250101కు కాల్ చేయాలని అధికారులు కోరారు.