ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు ఊరూరా యోగాంధ్ర మాసోత్సవాలు-కృష్ణబాబు
ప్రతిఒక్కరూ యోగాకు చేరువకావాలి..
అమరావతి: సుసంపన్న, ఆరోగ్య, ఆనందమయ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర విజన్ @ 2047 సాకారం దిశగా ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార, జనజాగృతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం) ఎం.టి.కృష్ణబాబు తెలిపారు.. ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ భారతీయ వారసత్వ, ప్రాచీన సంపదను అందరికీ అందించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి చొరవ కారణంగా ఐరాస తీర్మానంతో తొలిసారిగా 2015, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి.. ఈ ఏడాది విశాఖ ఆర్‌కే బీచ్‌లో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధాని రానున్నట్లు తెలిపారు..బుధవారం కృష్ణానదీ తీరాన హరిత బెరం పార్కు-పున్నమిఘాట్‌లో ఎన్‌టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో యోగాంధ్ర మాసోత్సవాల ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఇందులో వివిధ శాఖల అధికారులు, యోగా ఔత్సాహికులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ఆయుష్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్, విజయవాడ మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొనగా యోగా ట్రైనర్ రామాంజనేయులు యోగా ప్రయోజనాలతో పాటు పతంజలి యోగ సూత్రాలను వివరించి, యోగాభ్యసనాలు చేయించారు.