ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన,భారీ వర్షాలు కురిసే అవకాశం-ఐఎండీ
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం సోమవారం ఉదయం 0830 గంటలకు అదే ప్రాంతంలో కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది..ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 15 నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.ఆటు తర్వాత, ఇది పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి,,దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు తదుపరి 2 రోజుల్లో కొనసాగే అవకాశం ఉంది.
నెల్లూరు జిల్లా వాతావరణ సూచన:- ఓ మోస్తరు అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం.. అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..ఉరుములు మెరుపులతో కూడిన కొన్ని ప్రదేశాలలో పిడుగులు పడే అవకాశం..
మంగళవారం:- ఓ మోస్తరు చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం.. చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ఉరుములు మెరుపులతో కూడిన కొన్ని ప్రదేశాలలో పిడుగులు పడే అవకాశం..
బుధవారం:- ఓ మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది..పలు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ఉరుములు మెరుపులతో కూడిన కొన్ని ప్రదేశాలలో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది.