మద్యంపై ప్రివిలేజ్ ఫీజు పేరుతో లిక్కర్ గరిష్ఠ ధరల సవరణ
అమరావతి: రాష్ట్రంలో 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలులోకి రానున్న నేపధ్యంలో దేశంలో తయారయ్యే విదేశీ మద్యం(IMFL) బాటిల్ MRP ధరపై అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ ప్రభుత్వం సవరణ చేసింది.. రాష్ట్ర గవర్నర్ ఆమోదం మేరకు గెజిట్ నోటిఫికేషన్ ను ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ విడుదల చేశారు.. అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద MRP ధరలో చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం సర్దుబాటు చేసింది..బాటిల్ MRP ధర 150.50గా ఉంటే దాన్ని 160 రూపాయలకి ప్రివిలేజ్ ఫీజు అదనంగా పెంచింది.. క్వార్టర్ బాటిల్ ధర 90.50గా ఉంటే APF కలిపి దాని ధర 100 రూపాయలు అవుతుందని అధికారులు వివరించారు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్వార్టర్ బాటిల్ ధర 99కే నిర్ధారించినందున 100 ధరలో 1 రూపాయిని మినహాయించి విక్రయిస్తారని స్పష్టం చేసింది.. మొత్తం దరఖాస్తులు 90 వేల దాటొచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా..రూ.1800 కోట్లపైనే ఖజానాకు ఆదాయం సమకూరనుంది.